మొకురాల స్వర్ణలతకు డాక్టరేట్

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన మొకురాల రామేశ్వర శర్మ, సరోజ దంపతుల చిన్న కుమార్తె స్వర్ణలత డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా స్వర్ణలత పనిచేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రముఖ కథా రచయిత వల్లపురెడ్డి బుచ్చారెడ్డి సాహిత్యంపై చేసిన పరిశోధనకు గానూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రొఫెసర్ ఎన్.రజినీ పర్యవేక్షణలో ‘వల్లపురెడ్డి బుచ్చారెడ్డి జీవితం, సాహిత్యం’ అనే అంశంపై స్వర్ణలత పరిశోధన జరిపారు. త్వరలో జరగనున్న స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా స్వర్ణలత డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు.