డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ సెట్ నామినేషన్ దాఖలు

లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి భారాస ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి పి.ఉదయ్ కుమార్ కు రెండవ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.ఆయన అభ్యర్థిత్వాన్ని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బలపరచిన అనంతరం మీడియాతో మాట్లాడారు.భారాస అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అత్యున్నత ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకొని,ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చారన్నారు. కాంగ్రెస్,బిజెపి అభ్యర్థుల కంటే ఎన్నికల ప్రచారంలో భారాస ముందుందన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తుంటే, కాంగ్రెస్ కులం పేరుతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ మోసపూరిత హామీలని తేలిపోయాయన్నారు. మహాత్మ పూలే,బి.ఆర్ అంబేద్కర్ బహుజన వాదంతో పేదరిక నిర్మూల కోసం భారాస కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీడియా ఇంచార్జి అభిలాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »