మంత్రికి ఓట్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పై లేక పాయే

- బిఅరెస్ పార్ట్ ములుగు నియోగ వర్గ ఇంచార్జ్ బడేనాగ జ్యోతి
- వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
- మేడారంలో దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలన చేపట్టాలి
- జంపన్న వాగుకు ఉన్న కరకట్టను ఎత్తుకు పెంచాలి.
కోట్ల రూపాయల నిధులు తెచ్చామని గొప్పలు చెప్పడమే తప్ప మేడారంలో అభివృద్ధి శూన్యం.
ములుగు ప్రతినిధి ఆగస్టు 16 (జ్ఞాన తెలంగాణ)
భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లిందని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు
ఈ మేరకు శనివారం రోజున తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఆమె గ్రామస్తులతో కలిసి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.
తదనంతరం బడే నాగజ్యోతి మాట్లాడుతూ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంపన్న వాగు పొంగిపొర్లడం వల్ల మేడారం చుట్టుపక్కల గల పంట పొలాలు భారీగా దెబ్బతిన్నాయని, రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మేడారం దగ్గర ఉన్న జంపన్న వాగుకు కరకట్ట ఎత్తు పెంచి చుట్టుపక్కల ఉన్న పంట పొలాలను, మరియు సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు నీళ్లు రాకుండా చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని ఆమె అన్నారు.
మంత్రి సీతక్క కోట్ల రూపాయల నిధులు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప మేడారంలో అభివృద్ధి శూన్యమని ఆమె ఎద్దేవా చేశారు.
మంత్రి సీతక్క ఇక్కడి ప్రజల ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేశారో ఈ ప్రాంత ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య, జిల్లా నాయకులు ఎట్టి జగదీష్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిడం బాబురావు, మండల యూత్ అధ్యక్షులు కోట సురేష్, గ్రామకమిటి అధ్యక్షులు గజ్జెల సమ్మయ్య, సీనియర్ నాయకులు, ఎండీ రఫిక్, సిద్దబోయిన నర్సింగరావు, ఇర్ప విజయ, మాదరి కేశవరావు, వాల్లేపు సారయ్య, గుర్రాల రాజిరెడ్డి, మెండు సమ్మిరెడ్డి, బేండల నర్సయ్య, మాజీ వార్డ్ నెంబర్ ఇప్ప సతీష్, యూత్ నాయకులు ఆలం అర్జున్, చిడం సాగర్ తదితరులు పాల్గొన్నారు.