మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య
జ్ఞాన తెలంగాణ,ములుగు :
ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన ఎస్పీ జైలు రిటైర్డ్ అధికారి గగులోత్ సమ్మయ్య 01-12-2025న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు బద్రు, మాజీ సర్పంచ్ ఎన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క స్వయంగా పాల్గొని సమ్మయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వృత్తి రీత్యా వివిధ ప్రాంతాల్లో సేవలందించి, పదవీ విరమణ అనంతరం స్వగ్రామానికి చేరుకున్న సమ్మయ్య, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తనను పార్టీ వైపు ఆకర్షించాయని పేర్కొన్నారు. ఇకపై గ్రామ పురోగతికి, స్థానిక సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని సమ్మయ్య స్పష్టం చేశారు.
గ్రామ సేవకు ముందుకు వచ్చిన సమ్మయ్యకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన చేరికతో కాంగ్రెస్ బలం గ్రామస్థాయిలో మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్, పుట్ట వెంకటేశ్వర్ రెడ్డి, పప్పుల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సమ్మయ్య, శ్రీను నాయకులు తదితరులు పాల్గొన్నారు.
