రెండు సార్లు పాలాభి శాఖం చేసిన ఫలితం లేక పోవడం వలనే నిరాహార దీక్ష చేస్తున్నా

ములుగు/ఏటూరునాగారం ఆగస్టు 16(జ్ఞాన తెలంగాణ)
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం లో రెవిన్యూ డివిజన్ సాధన సమితి వ్యవస్థాపకులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ. నాటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకురాలు గా ఉత్తరం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేఖం చేసినారు కానీ ఫలితం రాలేదు అధికారం లోకి వచ్చిన తర్వాత మంత్రి మొదటి సారి ఎలాగైనా ఏజెన్సీ ప్రాంత నాయకులతో పాలాభి శేఖం చేపించుకోవాలని అసెంబ్లీ లో తీర్మానం చేసినట్టు చెప్పుతే 2వ సారి కూడా ఫలితం రాలేదు కాబట్టే ప్రజలపక్షాన రెవిన్యూ డివిజన్ ఆమోదం కోసం 78గంటల దీక్ష చేస్తున్నామని ఆర్ డి ఎస్ వ్యవస్థాపకులు డా జాడి రామరాజు నేత అన్నారు. అదేవిదంగా తెలంగాణ రెవిన్యూ చట్ట ప్రకారం ములుగు రెవిన్యూ డివిజన్ 50 కిలో మీటర్లు దాటి ఉన్నందున ఏటూరునాగారం మండలన్ని రెవిన్యూ డివిజన్ గా గుర్తించి మంగపేట తడ్వాయి కన్నాయిగూడెం వాజేడు వెంకటాపురం మండలాలకు మధ్యలో ఉన్నా ఏటూరునాగారం ను రెవిన్యూ డివిజన్ గా అమోదించాలని అన్నారు అదేవిదంగా నాటి తెరాస ప్రభుత్వం బీజేపీ పార్టీ రెవిన్యూ డివిజన్ కోసం 2023 సెప్టెంబర్ లో నిరాహార దీక్ష చేసినప్పుడు ప్రకటన చేస్తే నాటి ఎమ్మెల్యే నేటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉత్తరం ఇస్తే రెవిన్యూ డివిజన్ ప్రకటన చేసారని చెప్పి ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ నాయకులతో పాలాభిషేకాలు చేపించుకొని రాక్షస నందం పొందరిని అన్నారు. అదేవిదంగా తెరాస ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైదాన ప్రాంత నాయకులు నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి బీజేపీ పార్టీ ప్రజల పక్షాన చేస్తున్నా పోరాటం కు స్పందించి ప్రజల మెప్పుకొరకు అసెంబ్లీ తీర్మానం చేపించినట్టు మాట్లాడి ఏజెన్సీ ప్రాంత ప్రజలను నమ్మించి 2వ సారి కూడా ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ నాయకులతో పాలాభి శేఖం చేపించుకొని చరిత్ర సృష్టించారు కానీ రెవిన్యూ డివిజన్ ఆమోదం పొందలేదు కాబట్టే ఏజెన్సీ ప్రాంత ప్రజల పక్షాన రెవిన్యూ డివిజన్ కోసం 78గంటలు నిరాహార దీక్ష చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానాని అన్నారు.