సీనియర్ నాయకులు దైద యాకుబ్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సీనియర్ నాయకులు దైద యాకుబ్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దైద యాకుబ్ మరణించడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.