రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కూకట్ పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్

జ్ఞాన తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి

కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో బుధవారం హత్యకు గురైన రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను టి పి సి సి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి బండి రమేష్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతురాలి భర్త రాకేష్ అగర్వాల్ ను పోలీసులను సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.ఈ ఘటనను ఖండించారు.నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య ,ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి , బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శివ చౌదరి, సుదర్శన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »