చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి

జ్ఞాన తెలంగాణ,గండీడ్ మండల్ ప్రతినిధి, సెప్టెంబర్ 6:
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5 తారీకు రోజు మద్రాస్ కు ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుత్తనిలో వీరస్వామి సీతమ్మ దంపతులకు జన్మించాడు అతని కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినది బాల్య జీవితం తిరుత్తని తిరుపతిలో గడిపారు అతని తండ్రి స్థానిక జమీందారు సేవలో తాసిల్దారుగా పనిచేశారు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడు ఇతను విద్యాభ్యాసంలో ఎంచుకునే విషయాల కంటే యాదృచ్ఛికంగా తత్వశాస్త్రాన్ని అభ్యసించాడు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిలాస విభాగానికి ప్రొఫెసర్గా నియమితులయ్యారు ఇతని ఉపన్యాసాలు విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు ఉపాధ్యాయులు తెచ్చిన గుర్తింపు గౌరవానికి గాను ప్రతి సంవత్సరం అతను జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటారు బ్రిటిష్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మక సర్ అనే బిరుదును కూడా ఇచ్చారు మానవ సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు ప్రధానం చేశారు. ఇతను ఉపరాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించాడు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తనకు వచ్చే వేతనంలో కేవలం ఇరవై ఐదు శాతం తీసుకుని మిగిలిన జీతం ప్రధానమంత్రి సహాయ నిధికి తిరిగి ఇచ్చేవాడు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి, ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య బి.మల్లేష్, కె. వెంకటయ్య, కె. సికిందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
