రైల్వే ఆస్తుల రక్షణ మరియు ప్రయాణికుల భద్రతే ఆర్పీఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం: డివిజనల్ కమిషనర్ శ్రీ ఎ. నవీన్ కుమార్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, అక్టోబర్ 03:
ఖమ్మం జిల్లా ఆర్పీఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ కమిషనర్ శ్రీ ఎ.నవీన్ కుమార్ గారు ఖమ్మం ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన కార్యాలయం, బారక్లను పరిశీలించి నేర కేసులు మరియు సిబ్బంది అంశాలను సమీక్షించారు.ఆయన అధికారులు మరియు సిబ్బంది అందరూ రైల్వే ఆస్తులను రక్షించడానికి, ప్రయాణికుల భద్రతను కాపాడడానికి కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా నిషేధిత వస్తువులైన బ్లాక్ జాగరీ, గంజాయి, నిషేధిత మద్యం మొదలైన వాటి అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్బంగా శ్రీ బుర్ర సురేష్ గౌడ్, సీఐ ఖమ్మం, శ్రీ మోడిన్సా, ఏఎస్ఐ, శ్రీ ప్రసన్న కుమార్, ఏఎస్ఐ మరియు ఇతర సిబ్బంది హాజరయ్యారు.