పార్టీ వారి గూడెంలో వ్యవసాయ కార్మిక గ్రామ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

పార్టీ వారి గూడెంలో వ్యవసాయ కార్మిక గ్రామ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం


జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి: జనవరి 9 :

ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం పాటీవారి గూడెం గ్రామ శాఖ సభ్యత్వ నమోదు చేయడం జరిగింది 2000 వసూలు చేయడం జరిగింది. 230 వ్యవసాయకార్మిక సంఘం సభ్యులకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది. కార్మికులను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షలు ప్రతాపనేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలకు 12000 రూపాయలు ఇస్తానని, మహిళలకు 2500 రు. లు ఇస్తా అని, పేదలకు ఇంటి నిర్మాణం చేయడానికి 5 లక్షలు రూపాయలు ఇస్తా అని, స్థలం లేనివారికి స్థలం ఇల్లు కట్టి ఇస్తాను అని, కళ్యాణి లక్ష్మి కి లక్ష రూపాయలు తో పాటు తులం బంగారం ఇస్తా అని, రైతులు అందరికి రుణాలు 2 లక్షలు మాఫీ చేస్తా అని, రైతు బంధు 15 వేలు ఇస్తా అని, చెప్పి వాగ్దానాలు చేసి గెలిసి ఇప్పుడు అవి అమలు చేయకుండా మీనమేషాలు వేస్తుంది ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షం లో కూలీలు, రైతులు అందర్నీ సమీకరించి పెద్ద ఎత్తున మినిస్టర్ ల ఇండ్లు ముట్టడి చేస్తాం అని అన్నారు. కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ అధ్యక్షులు కుమ్మరి నాగమణి, కార్యదర్శి వీరమ్మ, cpm పార్టీ గ్రామ నాయకులు చెరుకూరి రామకృష్ణ, అనంతిని వీరయ్య, చేరుకూరి వెంకటనరసయ్య,జంగం లక్ష్మి కార్మికులు పాల్గొన్నారు

You may also like...

Translate »