పేద విద్యార్థులకు జాంబవవారసులం గ్రూపు చేయూత

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా ప్రతినిధి, జనవరి 17:


ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నలుగురు పేద మెడిసిన్ విద్యార్థులు కోర్లకంటి హర్షిత, బొక్క వసంత్, గొడ్ల సంధ్యారాణి, మేడి నాగేశ్వరి లకు జాంబవవారసులం గ్రూపు సభ్యుల సహకారంతో వచ్చిన మొత్తాన్ని ఈరోజు ఖమ్మం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) బొజ్జ.రామానుజం గారి చేతుల మీదుగా ఒక్కొక్క విద్యార్థికి పదివేల రూపాయల చొప్పున అందజేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ క్రాంతి రణదేవ్ , సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు వంగూరి ఆనందరావు తో పాటు గ్రూపు సభ్యులు బొజ్జ గంగన్న , మరికంటి కన్నారావు , చేకూరి చైతన్య , పరిమళ రాము గారు, కోటపర్తి శ్రీకాంత్ , కంచర్ల కర్ణాకర్ , దేవరకొండ అంబేద్కర్ గార్లతో మరియు మంచాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »