శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం : లక్ష్మీ సాహితి, ఉపేందర్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి,సెప్టెంబర్ 30:

ఖమ్మం జిల్లా శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో కుమారి సంగెపు లక్ష్మీసాహితి మరియు శ్రీ పోనుగోటి ఉపేందర్ గారికి సత్కారం, నిర్వహించారు,ఇటీవల ప్రభుత్వ నిర్వహించిన గ్రూపు 1,2 పరీక్షలలో ఉత్తీర్ణులై గ్రూపు వన్ లో డీఎస్పీగా నియామకమైనటువంటి వైరా పట్టణం శ్రీ సంగెపు వెంకటేశ్వర్లు కవిత దంపతుల పుత్రిక కుమారి సంగేపు లక్ష్మీసాహితిని కలిసిన శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ మరియు శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ బాధ్యులు కుమారి సంగెపు లక్ష్మీసాహితిని అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విధి నిర్వహణలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలని తద్వారా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఇటీవల ఫలితాలు వెలువడిన గ్రూపు 2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఎక్సైజ్ ఎస్సైగా నియామకం పొందిన చింతకాని మండలం చింతకాని గ్రామానికి చెందిన శ్రీ పొనుగోటి శ్రీను భాగ్యమ్మ దంపతుల కుమారుడు శ్రీ పొనుగోటి ఉపేందర్ ని కలిసిన శ్రీ దక్ష ప్రజాపతి సొసైటీ ముఖ్య నాయకులు శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పొనుగోటి ఉపేందర్ ని అభినందిస్తూ శాలువాతో సత్కరించి విధి నిర్వహణలో భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని తద్వారా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ అధ్యక్షులు తిగుళ్ళ వెంకటరమణ సొసైటీ గౌరవాధ్యక్షులు కానుగుల రాధాకృష్ణ శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు దరిపల్లి కిరణ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎలా సాగరపు ప్రసాద్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మొగిలిచర్ల వెంకటేష్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపాటి హనుమంతరావు ఉపాధ్యక్షులు కాంపాటి రమేష్ ట్రెజరర్ కొలిచలం చిరంజీవి. కుల పెద్దలు గుమ్మడిదల వెంకటనారాయణ సంయుక్త కార్యదర్శి గుమ్మడిల్లి సైదారావు సమన్వయకర్త కొత్తపల్లి సరవయ్య పాల్గొని అభినందించారు

You may also like...

Translate »