అక్రమ పద్దతిలో సిఈఓ భాద్యతలు

- సబ్ స్టాఫ్ విధులు నిర్వహిస్తూ డైరెక్ట్ గా సిఈఓ.
- సినియర్ ని పక్కన పెట్టి జూనియర్ కు ప్రమోషన్
- పాడి కింద వచ్చిన కమిషన్ లో కక్కుర్తి..
- పది లక్షలకుపైగా కమిషన్ నొక్కిన అధికారి
మండలంలో విశాల సహకార పరపతి సంఘంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అధికారులను సైతం పక్కదోవ పట్టించి ఉన్నత స్థాయిలో అధికారం వెల్లబుచుతున్నాడు..ఓ అధికారి. బీ శ్రీనివాసరావు అనే వ్యక్తి 2006 నుండి విశాల సహకార పరపతి సంఘం లో సబ్ స్టాఫ్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఇక్కడ పని చేసే సీఈవో చారి పదవీ విరమణ పొందగా అతని స్థానంలో స్టాఫ్ అసిస్టెంట్‌గా ఉన్న పరిమి పుల్లారావు సీఈవో అర్హత కలిగి ఉండగా ఆ సిఈఓ ప్లేస్ లో సబ్ స్టాఫ్ గా ఉన్న బీ.శ్రీనివాసరావు ను డైరెక్టుగా సిఈఓ అన్నట్లు పాలకవర్గం తీర్మానం చేసింది.అసలు కధ ఎంటంటే సబ్ స్టాప్ గా విధులు నిర్వహించేవారు డైరెక్ట్ గా సిఈఓ ఐయ్యే చాన్స్ లేదు కానీ కల్లూరు విశాల సహకార పరపతి సంఘం మాత్రం డైరెక్ట్ గా శ్రీనివాసరావు సిఈఓ అయ్యారు.ఇతని కంటే సినియర్ ఉన్న అతన్ని పక్కన పెట్టి శ్రీనివాసరావు కు సిఈఓ పదవి ఇవ్వటం వెనుక రాజకీయం జోక్యం తో అర్హత లేకపోయిన ఇచ్చారు అనే వాదన వినిపిస్తుంది.పాలక వర్గం కూడా జూనియార్ కే మొగ్గు చూపారు.దీంతో విశాల సహకార పరపతి సంఘంలో ఎమి జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయం పడుతున్నారు.
అయితే దొడ్డి దారిన సిఈఓ అయిన శ్రీనివాసరావు పై ఉన్నతదికారులకు కల్లూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చెయ్యటంతో అధికారులు కల్లూరు వ్యవసాయ పరపతి సంఘం వద్ద ఎంక్వైరీ చేశారు.ఎంక్వైరీ అధికారులను శ్రీనివాసరావు పక్కదోవ పట్టించాడు.నేను జాయిన్ అయ్యినప్పుడే క్లర్క్ గా జాయిన్ అయ్యాను అని సబ్ స్టాబ్ గా కాదని వాగ్ములం ఉచ్చారు.ఎంక్వైరీ అధికారులను సైతం బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు కానీ ఫలించలేదు.2006 నుండి శ్రీనివాసరావు సర్వీస్ రికార్డు పరిశిలించటంతో శ్రీనివాసరావు అబద్దాలు చెబుతున్నాడని ఎంక్వైరీ అధికారులు నిర్దారించుకున్నారు.పక్కదారిన సిఈఓ అయిన శ్రీనివాసరావు పై ఉన్నదాధికారులకు నివేదిక అందించారు ఎంక్వరి అధికారులు.
ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన నివేదికను ఉన్నాధికారులు చూసి చూడనట్లు వ్యహరించి పక్కదారిన సిఈఓ ఐన శ్రీనివాసరావు పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవతో సిఈఓ ఉన్నాదాధికారులను సైతం తన దారికి తెచ్చుకున్నాడని తోటి ఉద్యోగులు,కల్లూరు ప్రజలు గుస గుస లాడుతున్నారు.
అయితే ఇందంతా ఒక ఎత్తు శ్రీనివాసరావు సిఈఓ అయినప్పటి నుండి ధాన్యం కొనుగోలు సేకరణ కి వచ్చే కమిషన్ ఎమైందో తెలియదు.ప్రభుత్వం తరుపున ధాన్యం కొనుగోలు చేసినప్పుడు విశాల సహకార పరపతి సంఘానికి కమిషన్ పడుతుంది.ఆ కమీషన్ సిఈఓ తో పాటు మిగతా ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది.కానీ ఇక్కడ దొడ్డి దారిన సిఈఓ అయిన శ్రీనివాసరావు ఒక్కడే సుమారు11 లక్షలకు పైగా కమీషన్ ను నొక్కేశాడని పలువురు ఆరోపణ చేశారు.కనీసం తోటి ఉద్యోగులకు పైసా కూడా ఇవ్వలేదు.దీంతో తోటి ఉద్యోగులు బాండ్ పేపర్ పై పాడి కు వచ్చిన కమీషన్ డబ్బులు సిఈఓ ఒక్కడే తీసుకున్నాడని అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో అక్రమ పద్దతిలో సిఈఓ ఐన శ్రీనివాసరావు పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు చేసిన ఇద్దర్ని విధుల నుండి తోలగించారు.దీనిని బట్టి అక్రమ పద్దతి లో సిఈఓ అయిన శ్రీనివాసరావు రెంజ్ ఇట్లే అర్దం అవుతుందని అధికారులకు ఇచ్చే ముడుపుల కోసమే శ్రీనివాసరావు ను సిఈఓ గా చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు.అక్రమ పద్దతిలో సిఈఓ అయిన శ్రీనివాసరావు ను విధుల నుండి తోలగించి చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు పై వచ్చిన సుమారు 11 లక్షల రూపాయాల కమీషన్ ను అతని వద్ద రాబట్టాలని కల్లూరు ప్రజలు కోరుకుంటున్నారు. శ్రీనివాసరావు పై వచ్చిన అబియోగాలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే….