బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాతా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహాత్మా ఫూలే ప్రాంగణం దగ్గర వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర ఉపేంద్ర సాహు, జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు సంయుక్తంగా మాట్లాడుతూ ఫూలే దంపతులు మనువాద వ్యవస్థకు వ్యతిరేఖంగా స్త్రీలకు విద్యను అందించాలని 1848 లోనే షేక్ ఫాతిమా గారి సహకారంతో మొట్టమొదటి మహిళా పాఠశాలను స్థాపించారు. ఆ విధంగా మహిళలకు మొట్టమొదటిగా విద్యను అందించడమే కాకుండా, బాల్యవివాహాల నిర్మూలన, వితంతు పునర్వివాహాలు వంటి అనేక కార్యక్రమాల ద్వారా మహిళలకు స్వేచ్ఛను అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారు.ఈనాడు మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండడానికి కారణం పూలే దంపతులే అని అన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు మాత సావిత్రిబాయి పూలే గారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం కొరకు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు, జిల్లా కార్యదర్శి పల్లెపొంగు విజయ్ కుమార్, నాయకులు మట్టే నాగేశ్వరావు,పల్లెపొంగు రాజశేఖర్,బచ్చలకూరి బాలరాజు పాల్గొన్నారు