గులాబీ గుబాలింపు.. పుష్పం పులకరింపు..!!

  • ఊపందుకున్న పంచాయతీ ప్రచారం
  • పల్లె ఓట్లపై అమతుల్య దృష్టి
  • సమీక్ష సమావేశాలతో… నేతల దృష్టి

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 03:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో పంచాయతీ ప్రచారం మొదలయింది. పల్లెల్లో కండువా నేతలు ఖద్దరు నాయకుల అడుగుల సప్పుడు మొదలైంది. కార్ల మోతతో పంచాయతీ ఓటర్లు కన్నప్పగించె చూసే షీన్ ఆసన్నమైంది. ఒకరి తర్వాత మరొకరు కోటి పలకరింపులతో గులాబీ పార్టీ ఉపాలిస్తుండగా పుష్పం పార్టీ పులకరింపజేస్తుంది. పంచాయతీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఉండే ఖద్దరు నేతలు పల్లెల్లో ప్రచారం పేరట సందడి చేస్తున్నారు. అమతుల్య ఆదేశాలు ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకుల కదలికలతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో పల్లె పోరు రసవత్తరంగా మారుతుంది. స్వయంగా కాంగ్రెస్, బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల పెద్ద నేతలు పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి చూపుతుండడంతో ప్రచారం రాను రాను మరింత పుంజుకునే వాతావరణం కనిపిస్తుంది. పంచాయతీ సమరంపై తామే స్వయంగా నిలబడుతున్నామన్న రీతిలో మాజీ తాజా ఎమ్మెల్యేలు పావులు కదులుతుండడం ఆసక్తికరంగా మారింది. పంచాయితీలపై పట్టును సాధించాలని గులాబీ నేతలు గట్టిపట్టుతో ముందుకు పోతున్నారు. అన్ని పంచాయతీలు మావే అనే ధీమాతో కాంగ్రెస్ నేతలు కాలు కదుపుతున్నారు. తామేమి తక్కువేమీ లేమని పంచాయతీలపై బిజెపి జెండాను రెపరెపలాడిస్తామని బిజెపి నేతలు సైతం అంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిజెపి నేతలు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి రానున్న పంచాయతీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలో పల్లె ఓటర్లను ఏ విధంగా ఆకర్షింప చేసుకోవాలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ ఎలా చేర్చాలో అన్న విషయాలపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ప్రతి పల్లెలో పర్యటనలు ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఇంటికి ప్రధాని మోడీ సందేశం వెళ్లేలా కార్యకర్తలు పని చేయాలంటూ పార్టీ నేతలు నూతనత్తేజాన్ని నింపారు. మరోవైపు గులాబీ పార్టీ పల్లెల్లో గుబాలించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఇంటికి గులాబీ నేతలు వెళ్లే కార్యచరణకు సిద్ధమవుతున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ఓటర్లకు అందిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మాటలు తప్పే ప్రజలను మోసం చేస్తున్న వైజ్ఞాని ఎండగడుతూ పల్లె ఓటర్లను ఆకర్షించేలా పూ హాత్మక ధోరణిని అనుసరించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతి పంచాయతీ గులాబీ గూటికి చేరేలా కార్యసాధన తో కృషి చేయాలంటూ పార్టీ అమాత్యులు ఇచ్చిన పిలుపు మేరకు బాన్సువాడ నియోజకవర్గం లో దుద్దల అంజిరెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. తనకున్న అనుచరు గణాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పంచాయతీ ఓటర్లలో తమ పట్ల సానుకూలత వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటి నుండి బాన్సువాడ నియోజకవర్గంలో గులాబీ పార్టీ దేగా ఉండేది. ఆ పార్టీకి పెద్దాయనగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వహించేవారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో మారడంతో ఆ బాధ్యతను పైన బాజిరెడ్డి గోవర్ధన్ చూస్తుండగా కిందిస్థాయిలో మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, జుబేర్,గణేష్, ఆటో మౌలాలు,కీలకపాత్రను పోషిస్తున్నారు. మీరు కూడా పంచాయతీ ప్రచారంలో భాగంగా బుధవారం బాన్సువాడ మండలంలోని బొర్లం కొత్తబాది తిరుమలపురం గ్రామాల్లో పర్యటించి పంచాయతీ ఎన్నికల వాతావరణాన్ని పసిగడుతూనే ఆయా గ్రామాల పార్టీల శ్రేణులతో కలుస్తూ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పంచాయతీ సర్పంచులు జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా దక్కించుకోవాలని కావలసిన అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలంటూ దుద్దల అంజిరెడ్డి,నార్ల రత్నకుమార్, కార్యకర్తలను మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. గ్రామాలు బాగుపడాలంటే బి ఆర్ ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులనే గెలిపించుకోవాలని సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోయేలా.. క్షేత్రస్థాయి నాయకత్వం గట్టి పట్టుదలతో కృషి చేయాలని చైతన్యాన్ని నింపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ముందడుగు వేయలేకపోయారు. ఎన్నికల నగర మోడీ నాలుగు రోజులవుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆర్థిక చర్యలు చేపట్టలేదు. ఒకవైపు ఉత్సవాలు ప్రతి సవాళ్లతో పంచాయతీ పోరులో నేతలు ఉడుకుతుండగా మరోవైపు రాజకీయ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు అంటూ ప్రజలను పంచాయతీ ఓటర్లను విస్మయ పరుస్తుంది.

You may also like...

Translate »