కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో గణతంత్ర వేడుకలు.

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి: జనవరి 27 :


కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో మండల గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మరియు ప్రజలు గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఘనంగా పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మండల అధ్యక్షులు సుతారి రమేష్ గారు మాట్లాడుతూ ప్రజలకు అన్ని పథకాలు అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఇందులో ఎలాంటి సందేహం వలదని ఎవరు ఎలాంటి అపోహలు కలిగించిన వాటిని నమ్మరాదని ప్రజలతో ప్రభుత్వం ఉందని మండల అధ్యక్షులు సుతారి రమేష్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భూమ గౌడ్ గారు మరియు ఇంద్రసేనా రెడ్డి గారు మరియు ఆసిఫ్ గారు మండల గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొని ఘనంగా జరుపుకున్నారు.

You may also like...

Translate »