సెంట్రల్ కోఆర్డినేటర్ ను సన్మానించిన గద్వాల నాయకులు

జోగులాంబ : పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కేంద్ర సమన్వయకర్త దాగిళ్ల దయానందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేందర్ లు హాజరయ్యారు.జోగులాంబ గద్వాల బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు మణికుమార్, అలంపూర్ అసెంబ్లీ అధ్యక్షులు శశివర్మ తేజ, ప్రధాన కార్యదర్శి కోళ్ల మోహన్ రాజ్, ఆకేపోగు భాస్కర్, ఉపేందర్, ధర్మవరం రాముడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
