జోగులాంబ అమ్మవారి దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

జోగులాంబ అమ్మవారి దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జ్ఞాన తెలంగాణ,అలంపూర్:
అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయక శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి తో కలిసి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు జోగులాంబ అమ్మవారి లను దర్శించుకున్న ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ SA . సంపత్ కుమార్ గారు.
వీరితోపాటు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ గారు మరియు ఎస్పీ తోట శ్రీనివాస్ గారు, ఆర్డీవోలు దేవా దేవాలయ EO, మరియు కొంకల నాగేశ్వరరావు మరియు అలంపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు కూడా ఉన్నారు .
ఈరోజు అలంపూర్ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారాం ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో అలంపూర్ మార్కెట్ అభివృద్ధి గురించి మరియు
రైతులకు సబ్సిడీపై డ్రింప్ ఇరిగేషన్ సిస్టమ్స్ మరియు ఇతరత్రా సౌకర్యాలు కల్పించి సబ్సిడీలు అందజేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని మంత్రి గారికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ SA .సంపత్ కుమార్ గారు తెలుపడం జరిగింది.వీరి వెంట గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ ,మరియు ఎస్పీ తోట శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు.
