తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

హైదరాబాద్, ఆగస్టు 18 :
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షులు ఈడిగి సంజయ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్, హైదరాబాదులో కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, తెలంగాణ ఉద్యమకాలకు నెలవారి పెన్షన్రూ 25వేలు ఇవ్వాలని , ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఉద్యమకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా ప్రకటించాలని, ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని సంజయ్ గౌడ్, కోరారు. అదేవిదంగా ఉద్యమకారులపై ఉన్న అక్రమ కేసులు కూడా వెంటనే ఎత్తివేయాలని కోరారు. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »