మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం విజయవంతం

జ్ఞాన తెలంగాణ,టేకుమట్ల, సెప్టెంబర్ 6:
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టేకుమట్ల మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా జరిగింది. విద్యారంగంలో విశేష సేవలు అందించిన 11 మంది ఉపాధ్యాయులను మండల అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టేకుమట్ల తహసీల్దార్ శ్రీమతి కె. విజయలక్ష్మి హాజరయ్యారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి చిదిరాల సుధాకర్ మాట్లాడుతూ – “విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అపూర్వం. నిబద్ధత, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు సమాజ అభివృద్ధికి బలమైన పునాది వేస్తారు” అని అన్నారు. ఉపాధ్యాయులందరూ మరికొంత అంకిత భావంతో పనిచేస్తూ, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగాలని సూచించారు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు:
కె. ప్రసాద్ (ZPHS వెలిశాల), జి. పద్మ (ZPHS రాఘవరెడ్డిపేట), ఏ. శంకర్రావు (MPPS టేకుమట్ల), బి. వేణు (ZPHS రాఘవరెడ్డిపేట), ఎస్. కవిత (ZPHS టేకుమట్ల), ఎన్. స్వప్న (KGBV టేకుమట్ల), ఎం. వెంకటేశ్వర్లు (MPPS వెలిశాల), ఆర్. ప్రవీణ్ కుమార్ (MPPS రాఘవపూర్), బి. మాధవి (MPPS వెల్లంపల్లి), బి. హరికృష్ణ (MPPS రాఘవరెడ్డిపేట), దయాకర్ (MPPS రామకృష్ణాపూర్).కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, యూనియన్ సభ్యులు, మండల కోఆర్డినేటర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.