ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం


జ్ఞానతెలంగాణ,చిట్యాల,ఫిబ్రవరి28:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని
చిట్యాల ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించామని మండల విద్యాధికారి కోడేపాక రఘుపతి తెలిపారు.ఈ సందర్భంగా సైన్సు ఉపాధ్యాయులు కుచనపల్లి శ్రీనివాస్, సరళ దేవి, కల్పన, విజయలక్ష్మి ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థుల అందరి చేత బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, చిత్రాలను డ్రాయింగ్ చేయడం జరిగింది.సైన్స్ ఎగ్జిబిషన్ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. సైన్స్ దినోత్సవమును పురస్కరించుకొని విద్యార్థులందరికీ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాం రఘుపతి,సుజాత బుర్ర సదయ్య, సాంబారు రామనారాయణ, ఉస్మాన్ అలీ,గడ్డం శంకర్,మౌనిక భాస్కర్,సిఆర్పి రాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »