గత 18 ఏళ్లుగా తెలంగాణ సమగ్ర శిక్షలో వెట్టి చాకిరి చేస్తూ జీవనం సాగిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కంకల రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల వేణు డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఎ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 22 రోజులకు చేరింది. ముకుమ్మడిగా ఉరేసుకుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత ఏడాది సెప్టెంబర్ 13న టిపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు హనుమకొండలో ఏక శిల పార్క్ వద్ద చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించా రని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వందరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తానని హామీ ఇచ్చారన్నారు.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమ లు చేయాలని డిమాండ్ చేశారు.సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజే షన్ చేయాలని,ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు,సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజులు వేతనం తో కూడిన ప్రసూతి సె లవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ మ హిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవు లు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితా లలో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేస్తున్నా మన్నారు.సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలీచాలని వేటతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం గడుపుతున్నారని,వారిని రెగ్యులర్ చే యాలని, లేనిపక్షంలో పే స్కేల్ ప్రకటిస్తే ఆనందంగా వారి వృత్తి నిర్వహణలో ప్రభుత్వా నికి, ఇటు ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ కార్యనిర్వహణలో అంకితభావంతో పాల్గొంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చాంద్ పాషా,మహిళా అధ్యక్షురాలు చల్ల సునీత, మహేందర్ రెడ్డి,చంద్రకళ, నరేష్,రాజు,తిరుపతి, సుదర్శన్,సతీష్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు