గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

  • ఎమ్మెల్యే జీఎస్సార్

జ్ఞానతెలంగాణ,చిట్యాల జనవరి 03 :

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. లక్ష్మీంపూర్, నైన్ పాక, జూకల్ గ్రామాలల్లో ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం చింతకుంటరామయ్యపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, తిరుమలాపూర్ గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పశు వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 12 మంది కళ్యాణలక్ష్మీ లబ్దిదారులకు రూ.12,01,392/- విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందేలా చూస్తానని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఆరోగ్యకరమైన పశుసంపదను పెంపొందించుకోవాలని, ప్రజా ప్రభుత్వం రైతులకు వ్యవసాయంతో పాటు, పశువు సంపద అభివృద్ధికి సహాయపడుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో మండలానికి ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే నెరవేస్తామని, మండల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి. మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యం.
మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య.
మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య. జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ.
యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్.
టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్. నాయకులు
ఆరేపల్లి మల్లయ్య. పుల్లూరి సతీష్. గుండ రవీందర్. పువ్వాటి పూర్ణచందర్రావు.రాజ్ మహమ్మద్. చిలకల రాజకోమురు. బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్.బుర్ర మల్లేష్ గౌడ్
. గుర్రం తిరుపతి. చిలుముల రాజమౌళి. గంగాధరి రవీందర్. అల్లం రాజు.అధికారులు నరసింహారాములు. శనిగరపు మొగిలి. మండల అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »