సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి,ఆర్ గవాయి పైన దాడి చేసిన రాకేష్ కిషోర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి…

- నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయండి
జ్ఞానతెలంగాణ,జనగామ జిల్లా :
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజు స్టేషన్ ఘణపూర్ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం MRPS స్టేషన్ ఘనపూర్ మండల ఇంచార్జీ గాదె శ్రీధర్ మాదిగ గారి అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జనగామ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ గారు హాజరై మాట్లాడుతూ దళితులు ఉన్నత స్థానంలో కూర్చోవడం కొంతమంది అగ్రకులాలు ఓర్చుకోలేకనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇది కేవలం మన చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి కాదు , యావత్తు న్యాయ వ్యవస్థపై మరియు మా దళిత సమాజంపైన జరిగిన దాడిగా మేము భావించుకుంటున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా మన భారత రాజ్యాంగ మీద దాడి జరుగుతుంది చెప్తూ…ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావుతం కాకుండా చూడాలని, అదేవిదంగా తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాకేష్ కిషోర్ ని అరెస్టు చేయించాలని డిమైండ్ చేశారు. నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు ప్రతి మండలం నుంచి ప్రతీ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క నిరసనను విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ మాదిగ జిల్లా అధికార ప్రతినిధి సందెన రవిందర్ మాదిగ MRPS జిల్లా నాయకులు బోట్ల మహేష్ నలిమెల నాగరాజు, రాడపాక ఆదాం, చాడ ఏలీయ్య, మంద శ్రీను, దండు రామచంద్రు సంపత్, MRPS జిల్లా నాయకులు గుర్రం అశోక్ గుర్రం నవీన్, గాదెపాక మహేందర్, గంగాధర్ మాదిగ మంద శ్రీను మాదిగ ఎంఎస్పి జఫర్గడ్ మండల అధ్యక్షులు ఇల్లందుల రాంబాబు మాదిగ గాదె రామచంద్ర మాదిగ రంగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
