రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జ్ఞాన తెలంగాణ,చిల్పూర్ : చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన మారుతీ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి రైస్ మిల్లును ప్రారంభించారు. మిషనరీని పరిశీలించి పని తీరును మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.