నూజివీడు సీడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన

జ్ఞాన తెలంగాణ,అక్టోబర్ 23 గొల్లపల్లి :

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో గురువారం రోజున నూజివీడు సిడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని స్థానిక రైతు మాదాసు నారాయణ వరి క్షేత్రానికి విచ్చేసిన రైతులతో నూజివీడు సీడ్స్ ఏరియా మేనేజర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…. పుష్కల్ దొడ్డు రకం 120-125 పంట కాలం. ఈ రకం ఖరీఫ్ రబి కాలానికి సాగు చేస్కోవచ్చని ఈ రకం లో ప్రతి కంకిలో అదిక సంఖ్యలో గింజలు వచ్చునని, మొక్క ఎదుగుదాల మధ్యస్థ ఎత్తు పెరుగును పుష్కల్ బిఎల్బి అగ్గితేగులు, బిపిహెచ్ తట్టుకోగలదు అని దీని వలన రైతులకు తక్కువ ఖర్చు అవుతుందని, తద్వారా రైతులకు అధిక ఆదాయం పొందావచ్చునని తెలిపారు. స్థానిక రైతు మాట్లాడుతూ…. పుష్కల్ అన్ని రకాల తెగుళ్లను పురుగును తట్టుకుంటుందని దాదాపు 30-35 క్వింటళ్లలో దిగుబడీ వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. వచ్చే రబి, వానాకాలం లో ఈ పుష్కల్ రకం అధిక విస్తీర్ణం లో సాగు చేయవలసిందిగా కొరారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి దారావేణి మారుతి, జెట్టి వంశీమరియు స్థానిక డీలర్ దయాకర్ బొంకూర్ మరియు చుట్టూ పక్క గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Translate »