యువత నైపుణ్యా అభివృద్ధిని పెంపొందించుకోవాలి

అభిమాని దేవేందర్ నూతన కారు నడిపి ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్


జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 05 :
మండల పరిధి లోని పెద్దగోల్కొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనెగౌని శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అనుచరుడు కామోనిభాయ్ దేవేందర్ శనివారం నూతన మారుతి డిజైర్ వాహనాన్ని కొనుగోలు చేశాడు.కామోని భాయి దేవేందర్ రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు
టీ.ప్రకాష్ గౌడ్ వీరాభిమాని.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డైరెక్టర్ శ్రీకాంత్ గౌడ్ కు ఫోన్ చేసి దేవేందర్ ను వెంట తీసుకుని తన వాహనం తో రావాల్సిందిగా ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే దేవేందర్ తన నూతన వాహంతొ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడంతో జరిగింది ఎమ్మెల్యే నూతన వాహనాన్ని తన చేతుల మీదుగా నడిపించి దేవేందర్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. అందుకు దేవేందర్ సంతోషంతో ఎమ్మల్యే కి శాలువాతో పూల బొకే పళ్ళతో సన్మానించి మిఠాయి తినిపించి ధన్యవాదాలు తెలియజేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువత నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు తన యొక్క అభిమానులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తనపై అభిమానాన్ని చూపుతున్న వాళ్లకి ఎల్లప్పుడూ రుణ పడి ఉంటానాని తెలిపారు.

You may also like...

Translate »