– సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు రుద్ర కుమార్ నీరటి మల్లేష్
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04 : కార్మికుల పక్షాన ఎంతవరకైనా పోరాడుతామని జిల్లా సిఐటియు కమిటీ ఉపాధ్యక్షులు రుద్రకుమార్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నీరటి మల్లేష్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల ముందు శనివారం సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నీరటి మల్లేష్ రుద్రకుమార్ మాట్లాడుతూమున్సిపాలిటీ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీ కార్మికులకు కనీస వేతనం 26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు. అలాగే కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు పక్క రాష్ట్రంలో ఆంధ్రలో మున్సిపాలిటీ కార్మికులకు ఇస్తున్న ఇరవై ఒక్క 21 వేల రూపాయలను వేతనం ప్రస్తుతం చెల్లించాలని అన్నారు లేదంటే రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు డి నాగేష్ జిల్లా కమిటీ సభ్యుడు జయేందర్ మున్సిపాలిటీ మండల అధ్యక్షుడు టి ప్రవీణ్ యాదమ్మ ఇందిరా సుజాత రావేలా శీను సత్తయ్య రవి అరుణ్ దశరథ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.