పెరిగిన టమాటా ధరలు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :

రాష్ట్రంలో టమాటా (Tomato) ధరలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు ధరలు పడిపోయి కిలో టమాటా ధర రూ.20 నుంచి 30 ఉండగా, తాజాగా ఒక్క సారిగా పెరిగింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.60 నుంచి 70పలుకుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కు రాష్ట్రంతో పాటు, వివిధ రాష్ట్రాల్లో సైతం టమాటా పంటలు (Tomato crops) దెబ్బతిన్నాయి. దీంతో డిమాండ్కు తగ్గ టమాటా లేకపోవడంతో దాని ప్రభావం ధరలపై పడి ఈ పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో కూడా వర్షాలకు తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గిపోయింది. దీంతో రాష్ట్రానికి వచ్చే టమాటా సరఫరా కూడా ఆగిపోవటం ధరల పెరుగుదలకుకారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్కు గతంతో పోల్చితే సగం మాత్రమే దిగుమతి అవుతోంది. మరికొన్ని రోజులపాటు వర్షాలు ఇలాగే కొనసాగితే పంట తీవ్రంగా దెబ్బ తినే అవకాశంఉందనే ఆందోళనవ్యక్తమవు తోంది. దీంతో దిగుబడి తగ్గిధరలు మరింత పెరిగే అవ కాశం ఉందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.

You may also like...

Translate »