రౌడీలకు,మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం

- జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు కోసం పోలీసులు రౌడీలు కాళీ పనిచేస్తున్నారు
- రాష్ట్ర డిజిపి మాకు రెడ్ బుక్ లేదు,పింక్ బుక్ లేదు కేవలం ఖాకీ బుక్ మాత్రమే ఉందన్నారు
- బిఆర్ఎస్ నాయకులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు
- బైండోవర్ చేస్తామని బెదిరించడం దేనికి సాంకేతం
- రిజ్వి ఐఏఎస్ న బలవంతంగా రాజీమానామ చించిన మత్రులకు ముస్లిం ఓట్లు అడిగే హక్కులేదు
- రౌడీ రాజ్యం రావద్దంటే,రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే,హైడ్రా మన ఇళ్లను కూల్చేయద్దంటే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటెయ్యాలని పిలుపు
జూబ్లిహిల్స్,హైదరాబాద్:
జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా, ఈరోజు బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,బోరబండ డివిజన్ లోని, సైట్ 3 బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇది రౌడీలకు మరియు మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇందులో మహిళలే గెలవాలి.పోలీసులు రౌడీలు కలిసి జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తున్నారని వాక్యలురాష్ట్ర డిజిపి మాకు రెడ్ బుక్ లేదు,పింక్ బుక్ లేదు కేవలం ఖాకీ బుక్ మాత్రమే ఉందన్నారు.మరి కేవలం బిఆర్ఎస్ నాయకులనే ఎందుకు టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. బైండోవర్ చేస్తామని ఎందుకు బెదిరిస్తున్నారు అని నిలదీశారు. కాంగ్రెస్ మంత్రులు టెండర్ల కోసం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన రిజ్వి ఐఏఎస్ అధికారిని బలవంతంగా రాజీనామా చేసేలా వేదించారు.ఇపుడు ఏం ముఖం పెట్టుకొని ముస్లింలను ఓట్లు అడుగుతారు?కాంగ్రెస్ మంత్రులు లిక్కర్ సీసాల మూత మీద అతికించే స్టిక్కర్లను కూడా వదలకుండా కుంభకోణానికి పాల్పడుతున్నారు. మహిళలను వేధించే వారు,వ్యభిచార గృహాలను నడిపించే అల్లరిమూకలకు సంబంధించిన వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. జూబ్లిహిల్స్ ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు?చిల్లర కొట్టు పెట్టుకొని చిరు వ్యాపారం చేసే వారి మీద కూడా దందాలు చేసే వారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను చేస్తుంది.వీరి వల్ల తెలంగాణ ఆగమవుతుంది. ఇప్పటికీ ఒకసారికాంగ్రెస్ పార్టీకి ఓటేసి రెండేండ్ల నుండి మోసపోతున్నాము.
ఇపుడు మళ్లీ ఓటేసి మోసపోవద్దు.కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో భాగంగా రోడ్డు మీద ఉండే డివైడర్ ను కూడా తొలగించారు.గెలవకముందే ఇంత అరాచకాలకు పాల్పడితే గెలిచాక ఏం చేస్తారో ఓటర్లు ఆలోచించాలి.రౌడీ రాజ్యం రావద్దంటే,రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే,హైడ్రా మన ఇళ్లను కూల్చేయద్దంటే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.జూబ్లిహిల్స్ ప్రజలంతా బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చూస్తున్నారని తెలిపారు.



