బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్న నలు పొందాలి

బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్న నలు పొందాలి
- ప్రతి ఒక్కరూ విధుల పట్ల నిబద్ధత కలిగి ఉండాలి
- ఫైర్ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో
- మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04: బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని, ప్రతి ఒక్కరూ విధుల పట్ల బాధ్యతగా ఉండాలని తెలంగాణ ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంనార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగులపల్లిలో శనివారంఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో జరిగిన ఫైర్ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.ఉద్యోగులకు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి మంచి పేరు సంపాదించుకోవాలన్నారు. విధుల పట్ల అంకితభావం తో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

