జేయన్టీయుహెచ్ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మహిళా ప్రొఫెసర్లకు సన్మానం

జేఎన్టీయూ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంఘసంస్కర్త శ్రీ సావిత్రి బాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించినందుకు జేయన్టీయుహెచ్ జేఏసీ తరపున హర్షం వ్యక్తం చేస్తు మహీళా ఆచార్యులందరికి శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీలోని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జేయన్టీయుహెచ్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రి బాయి పూలే ఫోటోకు పూలమాలలు వేసి సావిత్రి బాయి పూలే చేసిన గొప్ప సంస్కరణలను గుర్తుచేశారు. తదనంతరం మహీళా ఆచార్యులైన డా. వసుమతి, డా. మాధవి కుమారి, డా. సుష్మా, డా. శోభారాణి, డా. ఇంద్రారాణి, డా. సుప్రీతీ, డా. హేమలత డా. పద్మావతి ఆచార్యులను శాలువాతో సన్మానించి మోమొంటోలను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ బొట్ల బిక్షపతి, వైస్ చైర్మన్ అంబటి తేజ, రాష్ట్ర అధ్యక్షులు బల్గర్ సందీప్, వర్కింగ్ ప్రెసిడెంట్ దాస్యం విక్రాంత్, జనరల్ సెక్రటరీ కె. దిలీప్, ఉపాధ్యక్షులు పి. సుకుమార్ రెడ్డి, టి.తేజ, సోషల్ మీడియా ఇంచార్జీ సెక్రటరీలు ఆర్. శివాజీ, యూనివర్సిటీ అద్యక్షులు ఆదిమల్ల పవన్ కుమార్ జనరల్ సెక్రటరీ సైదా, వేణు, ప్రణయ్ వైస్ ప్రెసిడెంట్ హార్ష, లోకేశ్వర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అభిరామ్, నర్సింహా, సిద్దార్థ్, సాత్విక్, తిరు సెక్రటరీ శివ కుమార్, విక్రాంత్, సోషల్ మీడియా ఇంచార్జీ శ్రవణ్, గోపీనాథ్ మహిళా సభ్యులు సుష్మిత, భార్గవి, శివాణీ పెద్ద ఎత్తున విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు.ఇట్లు,డాక్టర్ బొట్ల బిక్షపతి, చైర్మన్,జేయన్టీయుహెచ్ జేఏసీ.

You may also like...

Translate »