సామాజిక విప్లవకారులు సావిత్రిబాయి పూలే

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి
బ్రహ్మనిజం పై పోరే సావిత్రిబాయికి నిజమైన నివాళి
జ్ఞాన తెలంగాణ కాజీపేట జనవరి 3 కాజీపేట పట్టణం ఫాతిమాలోని ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ తరఫున భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు స్టాలిన్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు ముఖ్యఅతిదిగా హాజరైన విద్యాదేవి మాట్లాడుతూ భారతదేశంలో అగ్రవర్ణ వ్యవస్థ ఆధిపత్యం వహిస్తున్న సమయంలో జ్యోతిబాపూలే చదువు నేర్చుకుని తన భార్య సావిత్రిబాయి పూలే కి చదువు నేర్పి ఇంటి నుండే సమాజ మార్పును మొదలుపెట్టారని కొనియాడారు ఆ మార్పు పూర్తి మహారాష్ట్ర అలాగే దేశమంతా వ్యాప్తి చెంది ఎంతోమందిని నిరక్షరాశులకు ముఖ్యంగా మహిళలు నిమ్న వర్గాల ప్రజలకు సత్యశోధకు సమాజ్ ద్వారా చదువు నేర్పించి వారి స్థితిగతులను మార్చారని అన్నారు నేటితరం యువత విద్యార్థులు సావిత్రిబాయి పూలే జీవితాన్ని పూర్తిగా తీసుకొని అసమ సమాజంలో వస్తున్న రుక్మతులకు అలాగే పాస్టర్ ప్రదేశాల విశ్వ సంస్కృతి ప్రత్యామ్నాయ సామాజిక విప్లవం సాధించవలసిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కల్యాణ్ కార్యదర్శి జస్వంత్ జిల్లా కమిటీ సభ్యులు అరుణ్ అలాగే రాకేష్ నర్సింగ్ కాలేజ్ మరియు విద్యార్థి,విద్యార్థినిలు పాల్గొన్నారు.