హనుమకొండ పద్మాక్షి గుండం మరియు బంధం చెరువును వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన: ఎమ్మెల్యే నాయిని

జ్ఞాన తెలంగాణ ,హనుమకొండ:

నగరంలో కొలువుదీరిన మహా గణపతుల నిమజ్జనం పట్ల అందరు సంసిద్ధంగా ఉండాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం నాడు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి హనుమకొండ పదవ డివిజన్ పద్మాక్షి గుండం మరియు 49 డివిజన్ బంధం చెరువుల వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ… ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిమజ్జన ప్రాంతాలలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేయాలని,చిన్న గణపతులను నేరుగా వేసుకునే విధంగా మెట్ల మార్గం కల్పించాలి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ముందస్తు చర్యలు తక్షణమే చేపట్టాలి, సిద్దేశ్వర బండు (పద్మాక్షి గుండం) చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని,భారీ గణపతులు ఏర్పాటుచేసిన క్రమంలో నిమర్జనాల వద్ద భారీ క్రేన్లు అందుబాటులో ఉంచాలన్నారు. బంధం చెరువు అన్యాక్రత భూముల నివేదికలు అందించాలి, అలాగే కబ్జాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు, రానున్న రోజులలో హైడ్రా తరహాలో వాద్రా రానున్నది. అధికారులు చెరువు శిఖం భూముల పట్ల ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో 49 డివిజన్ కార్పొరేటర్ మానస రాంప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట రఘుపాల్ రెడ్డి రాజమల్లారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »