భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి యుండాలి

డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చుంచు రాజేందర్.


ప్రభుత్వ పథకాలను
దళతులు సద్వినియోగం చేసుకొండి
.

జ్ఞాన తెలంగాణ హసన్‌పర్తి డిసెంబర్ 31 :

హసన్ పర్తి మండల కేంద్రంలో రాజ్యాంగం దళితులను,గిరిజనులను ఇతర కులాలతో సమానంగా జీవింపజేసిందని,
ప్రతి నెల నిర్వహించే పౌర హక్కుల దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించి, కులాల మద్య అసమానతలను తొలగించే విధంగా కులాలకతీంగా భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంపోందించుకోవాలని,
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తు దారుడికి ఇందిరమ్మ ఇండ్లను ఎటువంటి ఆంక్షలు లేకుండా మంజూరి చేయాలని డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చుంచు రాజేందర్ కోరారు.
సోమవారం నాడు మడిపల్లి గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) ఫజీల్ ఆద్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా తహాసిల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ దళితులు తమ సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కారానికి మార్గం చూపుతామన్నారు.
గ్రామంలో బాల కార్మికులు,వెట్టి చాకిరి ఉందాఅని,దళిత వాడలలో కరెంటు, మంచినీటి,డ్రైనేజి సమస్య ఉన్నదా అని అదే విధంగా జోగిని, భానమతి గురించి సమావేశంలో అడిగి తెలుసుకున్నారు.
ప్రజా పాలనలో ప్రభుత్వ పథకాల కొసం దరఖాస్తు చేసుకున్న అర్వూలందరికి పథకాలను అందిస్తామని అన్నారు.
దళిత వాడలో మంచి నీటి సమస్య, ప్రమాద కర ఇనుప కరెంట్ పోల్ సమస్యపై కరెంట్ అధికారులతో మరియు మండల యంపివో గారికి పోన్ లో సమస్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో భూమి సమస్యలు సాదాబైనామా సమస్యలు మా దృష్టికి తీసుకువచ్చిన వాటిని క్షేత్ర స్థాయిలో పరిక్షించి పరిష్కార మార్గం చూపుతామన్నారు.
దళితులను ఇతర కులాల వారు సమానంగా చూడాలని కులవివక్షత చూపుతే చట్ట రీత్యా నేరమన్నారు.
మనషులందరూ సమానమేనని ఆ దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో
ఆర్ ఐ ఫజిల్ , గ్రామ మాజీ సర్పంచులు కాందారి బాగ్యలక్ష్మి కృష్ణ మూర్తి,
చిర్ర సుమలత విజయ్ కుమార్, దళిత వాధి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సందెల రవిందర్, డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, రెవెన్యూ సిబ్బంది మరియు గ్రామ పంచాయితి సిబ్బంది,ఆశ వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »