నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతనేని వరప్రసాద్

జ్ఞానతెలంగాణ,భద్రాద్రి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతనేని వరప్రసాద్ ఆఫీస్ వద్ద ఆయన చేతుల మీదగా నూతన క్యాలెండర్ ట్రూ నైన్ న్యూస్ ఎలక్ట్రానిక్ క్యాలెండర్ ను ఆవిష్కరించటం జరిగింది ఈ కార్యక్రమం తదనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతనేని వరప్రసాద్ మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తూ అలాగే ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజలకు చేరవేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యలో వారధిల ఉండి సామాజిక సాహిత్య అంశాలపై అవగాహన కల్పిస్తూ సంఘ వ్యతిరేక శక్తులను ఎండగట్టే ప్రయత్నం చేస్తూ అందుకు అనుగుణంగా వ్యాసాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కోసం ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండ పనిచేస్తూ అవినీతి తాహిత సమాజం కోసం పాటుపడుతూ నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం కోసం మా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాం అంటూ నిత్యం ప్రజల సమస్యల కొరకు పోరాడే యోధుడు జర్నలిస్టు అటువంటి మీరు అందరూ కలిసికట్టుగా ఉంటే ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా ఉండి ఐక్యమత్యంగా ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజల సమస్యలను ఇటు పై అధికారులకు అటు ప్రభుత్వానికి తెలియపరుస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీడియా మిత్రులు అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ పర్వతనేని వరప్రసాద్.ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిల నరసింహారావు సుగసాన్ని శ్రీధర్ మోరంపూడి నరసింహారావు చింతలచెరువు వెంకటేష్ మరియు ట్రూ నైన్ రిపోర్టర్ నాగేంద్ర ఆర్.ఎం.పి మట్ట సోములు మరియు ఆయన అభిమానులు కిరణ్ భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు..