నారాయణ పురం లో ప్రభుత్వ పాఠశాల ఆటస్థలం కబ్జా

నారాయణ పురం లో ప్రభుత్వ పాఠశాల ఆటస్థలం కబ్జా

  • పట్టించుకోని అధికారులు
  • పాఠశాల ఆట స్థలంను BC కమ్యూనిటీ హాల్ కొరకు కబ్జా
  • ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేదంతా 4 గ్రామాల ఆదివాసీ, దళిత బిడ్డలే
  • SC, ST ప్రజలు ప్రశ్నిస్తే వ్యక్తిగతమైన దూషణలు చేస్తున్న అగ్రవర్ణాలు
  • భయం గుప్పిట్లో నారాయణ పురం దళిత, ఆదివాసీ బిడ్డలు

జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట (నారాయణ పురం) ప్రతినిధి :
నారాయణపురం గ్రామంలో పెచ్చు మీరుతున్న కుల రాక్షసి.SC ST లను కులం పేరుతో దూషిస్తున్న అగ్ర వర్ణాలు,.మేము మాత్రమే బ్రతకాలి అనే ధోరణిలోనే అగ్ర కులాల మాటలు ఉన్నాయంటూ పలువురు దళితుల వాదన,అయితే ఎన్నో ఏళ్ళుగా SC కాలనీలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాల ఆట స్థలం కొరకు సుమారుగా రెండు ఎకరాల వరకు మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంది.అక్కడ ఎక్కువ శాతం 95% మంది పిల్లలు SC ST ప్రజలు పిల్లలు మాత్రమే ఆ పాఠశాలలో చదువుతున్నారు. ఆ ఆట స్థలం మెయిన్ రోడ్ ప్రక్కనే ఉండటం వలన ఆ స్థలంపై కొందరి కళ్ళు పడినాయి.మేము రాజకీయ నాయకులం మేము కాంట్రాక్టులము అంటూ ,మేము ఆధిపత్యం మాదే అంటూ దుర్భాసలాడారు. ఒక విలేకరి ఫోటోలు తీస్తున్న తీయకుండా అడ్డుకున్నారు. కొంతమంది వ్యక్తులు ఇది గుడి కోసం కాదు బడి కోసం కాదు, ఇది మా బీసీ భవనం కోసం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ విర్రవిగిపోయారు. కొంతమంది దళితులను చులకనగా మాట్లాడుతూ, వీళ్లకు తినటానికే తిండి ఉండదు కానీ, ఆట స్థలం కావాలంట అంటూ చులకన చేసి మాట్లాడుతున్నారు.సంబంధిత పైఅధికారులు ఈ పాఠశాల సుమారుగా 2 ఎకరాల ఆట స్థలం ను కాపాడి నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం కి ఒక అర్ధం తీసుకురావాలని నారాయణపురం కాలనీ లో నివసిస్తున్న sc St ప్రజలు కోరుకుంటున్నారు.

You may also like...

Translate »