స్పెషల్ ఆఫీసర్ కు గ్రామపంచాయతీ బాధ్యతలు అప్పగింత

స్పెషల్ ఆఫీసర్ కు గ్రామపంచాయతీ బాధ్యతలు అప్పగింత
జ్ఞాన తెలంగాణ (టేకుమట్ల) వెంకట్రావుపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలుమీ అందరి సహాయ సహకారాలతో 2019 ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాలు గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములైన మీ అందరికీ పేరుపేరున నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధి విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పార్టీలకతీతంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ.. గ్రామంలోని విద్యావంతులకు, ఉపాధ్యాయులకు, గ్రామంలోని ఎంపిటీసి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, యువకులకు, గ్రామ పెద్దలకు ప్రత్యేకంగా మహిళలకు తల్లులకు నమస్కరిస్తున్నాను. మీరు నాకు ఇచ్చిన బాధ్యతను 100కు 90 శాతం నెరవేర్చానని అనుకుంటున్నాను. నా పదవికాలంలో నా వలన కానీ నా పాలకవర్గం వలన కానీ పంచాయతీ కార్యదర్శి వలన కానీ సిబ్బంది వలన కానీ తెలిసి తెలియక ఎవరైనా ఇబ్బంది కలిగించి ఉంటే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించగలరు.
నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అన్ని శాఖాల అధికారులకు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి మరోసారి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాగా శుక్రవారం ఉదయం ప్రత్యేక అధికారి అయిన నిర్మల(ఈ.ఈ) గారికి బాధ్యతలను అప్పగించడం జరిగింది అని వెంకట్రావుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు