ఓయూ లో ఉదృతమైన సర్కులర్ వ్యతిరేక ఉద్యమం

- ఓయూ లో భారీ రాస్తారోకో
- విద్యార్థి నేతల అరెస్టులు
- ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల JAC
జ్ఞానతెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి :
ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన విద్యార్థి నేతలు, రాస్తారోకో చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు..నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు.
ఓయూలో అప్రజాస్వామికంగా విడుదల చేసిన సర్క్యులర్ ను తక్షణమే వాపస్ తీసుకోవాలి డిమాండ్ చేశారు. తెలంగాణ మేధావులు ,ప్రజా సంఘాలు, ప్రతి పక్షాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు ఓయూ క్యాంపస్ డెమోక్రసీ కాపాడటానికి ఓయూ విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
ఈ రాస్తారోకో సందర్భంగా అరెస్టయిన వారిలో జార్జిరెడ్డి పి.డి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.నాగేశ్వరావు, ప్రధాన కార్యదర్శి ఎన్.సుమంత్, డి.బి.ఎస్.ఏ జంగిలి దర్శన్, బి.ఆర్.ఎస్.వి పెద్దమ్మ రమేష్, జంగయ్య, స్పోర్ట్స్ ఫెడరేషన్ శాగంటి రాజేష్, ఎస్.ఎస్.యూ మొగిలిపాక నవీన్, జే.వి.ఎస్ చేరాల వంశీ, బి.ఆర్.ఎస్.వి రాజేష్ నాయక్, మిథున్ ప్రసాద్, రామకృష్ణ, శివ,
జార్జి రెడ్డి పి.డి.ఎస్.యూ నేతలు ఎం.వెంకటేష్, ఎస్.అంజి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్, దళిత,బహుజన,గిరిజన,ఆదివాసీ, ఇండిపెండ్ సంఘాల నేతలు నాయకత్వం వహించారు.

