పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

  • పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే…
  • పర్యవేక్షించిన కాంగ్రెస్ నాయకులు
  • నిరుపేదలకే ప్రభుత్వ పథకాలు.

ఙ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి,తేది :-

శ్రీరంగపురం మండల కేంద్రంలోనీ అంబేద్కర్ కాలనీ నందు గ్రామపంచాయతీ కార్యదర్శి నందకిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు మరియు మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జె. ఆశన్న గార్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు గారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క సామాన్యునికి కచ్చితంగా ప్రభుత్వ పథకాలు అందుతాయని, అలాగే ఇల్లు లేని ప్రతి ఒక్క పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడుతుందని, కొంతమంది దళారుల మాటలు నమ్మి ప్రజల మోసపోవద్దని, గ్రామంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని, ఇట్టి సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించగలరని వారు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగపురం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం గంగాధర్ యాదవ్, మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి జే ఆశన్న, శ్రీరంగాపూర్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పి శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు బి రమేష్, తోట రవికుమార్ మరియు కాంగ్రెస్ యువ నాయకులు పసుల రాజా వర్ధన్, బోయ రాఘవేందర్, వెంకటేష్ బాబ్జి, అంబేద్కర్ కాలనీవాసులు జై ఈశ్వర్, బి శ్రీకాంత్, బి సంపత్, జె .రాముడు, ధర్మరాజు, చింతకుంట రాముడు, ఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »