అనాధ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది: మంత్రి సీతక్క.

అనాధ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది: మంత్రి సీతక్క.

హైద‌రాబాద్ జనవరి 03:అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.అనాథలమని అధైర్య పడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు ప్రభుత్వ పాఠ శాలలు కాలేజీల సీట్లలో అనాథలకు 2 శాతం రిజర్వేషన్ కల్పించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈమేరకు మంత్రి సీతక్క బుధవారం ట్వీట్ చేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చూడాలని అధికారులకు సూచించి నట్లు తెలిపారు.

అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల పరిసరాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు స్కూలు ఆవరణలోనే ప్రీ స్కూళ్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని చెప్పారు.అంగన్‌వాడీ కేంద్రాలకు స్థానిక మండలాల నుంచే పాలు సరఫరా చేయాలని సూచించారు అంత‌కు ముందు రోజు సీత‌క్క స్ర్తీ శిశు సంక్షేమం శాఖ‌పై అధికారుల‌తో సమీక్ష నిర్వ‌హించారు.ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ స‌మావేశంలో సీత‌క్క మాట్లాడుతూ దత్తత నిబంధనలు క్లిష్టంగా ఉండడంతో చాలామంది పిల్లల దత్తతకు ముందుకు రావడం లేదన్నారు.నిబంధనలను సరళతరం చేసే అవకాశాన్ని పరిశీ లించాలని అధికారులకు సూచించారు మహిళా ఉద్యోగస్తుల కోసం సిటీలు జిల్లా కేంద్రాల్లో వసతి గృహా లను ప్రతి జిల్లాలోనూ వృద్ధా ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

You may also like...

Translate »