శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో…. _రాజ్యశ్యామల దేవి హోమం

  • పాల్గొన్న కాటా సుధా శ్రీనివాస్ గౌడ్,శశిధర్ రెడ్డి దంపతులు

అమీన్ పూర్,నవంబర్ 18( జ్ఞాన తెలంగాణ) :
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రాజ్యశ్యామల దేవి హోమం నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం ఘనంగా కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి చిత్రాన్ని ముగ్గుతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటా సుధ శ్రీనివాస్ గౌడ్,ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్,ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ గుప్తా, మల్లికార్జున్ రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు,శశిధర్ రెడ్డి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ…
కార్తీక మాసం సందర్భంగా రాజ్యశ్యామల దేవి హోమం నిర్వహించడం పుణ్యకరమైన కార్యం.గురువుల సూచనల ప్రకారం ఈ దేవత భక్తుల కోరికలను శీఘ్రంగా తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది.ఆలయ కమిటీ, భక్తుల సహకారంతో హోమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగాం అని తెలిపారు.
మంగళవారం రోజు మాస శివరాత్రి ఉండటంతో ఈ హోమానికి మరింత ప్రాధాన్యం చేకూరిందని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

You may also like...

Translate »