ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

  • సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య

ఘనపూర్ (స్టేషన్)జ్ఞాన తెలంగాణ : ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని కాబట్టి పార్టీ కార్యకర్తలు శ్రేణులు సైనికుల్లా పని చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పిలుపునిచ్చారు.*ఘనపూర్ మండల కేంద్రంలోని మా గార్డెన్స్ లో సిపిఎం రెండవ రోజు ప్రతినిధుల సభకు అధ్యక్ష వర్గంగా రాపర్తి రాజు, ఇర్రి అహల్య, బూడిద గోపి, మునిగెల రమేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మహాసభ పర్యవేక్షకులుగా హాజరైన జి నాగయ్య మాట్లాడుతూ

దేశంలో బిజెపి పార్టీ అధికారంలో వచ్చిన నాటినుండి ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి ఉందని నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరుగుతుందని, దేశంలో నిరుపేదలో కార్మికుల కర్షకులపై పన్నుల బారాలను మోపుతూ సంపన్నుల కోసం ప్రతి బడ్జెట్ సమావేశాల్లో లక్షల వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని రైతాంగం సంవత్సరం పాటు ఢిల్లీ చుట్టూ 13 నెలల పాటు 5 లక్షల మంది రైతులు అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకుని వండుకొని భార్యా పిల్లలు అనేకమంది పోరాటం చేసిన ఫలితంగా తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ మూడు చట్టాలను భారత పార్లమెంటు సాక్షిగా ఉపసంహరించుకుంటున్నట్లు దేశ రైతాంగానికి మూడు క్షమాపణలు చెప్పిన పరిస్థితి ఉన్నదని కానీ ఎన్నికలు సమీపిస్తున్నాయని గ్రహించి దేశ రైతాంగానికి ప్రధానమంత్రి రాతపూర్వకంగా హామీని ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయని కారణంగా తిరిగి దేశ రైతాంగం ఢిల్లీ చుట్టుపక్కల హరియాన పంజాబ్ ఉత్తరప్రదేశ్ రైతాంగం పోరాటాలను ప్రారంభించారని అమర నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారని మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధరలు చట్టం చేయాలని అదేవిధంగా ఫసల్ బీమా యోజన రైతులకు అనుకూలంగా మార్చాలని కిసాన్ సామాన్ నిధి సంవత్సరానికి 10000 రూపాయలకు పెంచాలని దేశవ్యాప్తంగా రైతాంగ రక్షణ కోసం దేశవ్యాప్తంగా రుణ విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంపై దాడి రాజ్యాంగ విలువల మీద దాడి రాజ్యాంగం మీద దాడి ప్రజాస్వామ్యం లౌకిక తత్వం పై దాడి ప్రాంతీయ పార్టీల మీద దాడి మొత్తం భారతదేశ మస్తిత్వంపై మత విశ్వాసాలపై మతసామరస్యంపై దాడి చేస్తూ మతోన్మాద ధోరణులను పెంపొందిస్తూ భారతదేశ అస్తిత్వంపై దాడి చేస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపిని నిలువరించడం కోసం వామపక్షా పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమాలను ఉదృతం చేయాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు అదేవిధంగా బ్రిటిష్ నాటి నుండీ ఉన్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ గా మార్చి పని గంటల విధానాన్ని తెలుసు యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా కట్టు బానిసలుగా చేయడం కోసం మోడీ ప్రభుత్వం అంబానీ అదానీ ద్వయంతో కలిసి ఈ దేశాన్ని, సహజ వనరుల ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని అప్పనంగా అప్పగిస్తుంది ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో కోట్లాది రూపాయల నిధులను ఎన్నికలలో ఏవీఎం మిషిన్ ప్రజలు వేసిన ఓట్ల కంటే లక్షలాది ఓట్లు ఎక్కువగా లెక్కిస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని స్వతంత్ర ఎన్నికల సంఘాన్ని , ఈడి వంటి రాజ్యాంగ సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా నిర్మాణ గైడ్ కామ్రేడ్ ఎండి అబ్బాస్ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య సింగారం రమేష్ సాంబరాజు యాదగిరి బోట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్ సుంచు విజయేందర్ భూక్యా చందు నాయక్ బెల్లంకొండ వెంకటేష్, చిట్యాల సోమన్న కోడేపాక యాకయ్య బోడ నరేందర్ పోతకనూరి ఉపేందర్ ఎండి అజారుద్దీన్ ఎండి షబానా ప్రజా సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానోతు ధర్మదీక్షం గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీర సురేష్ నాయక్ మండల కార్యదర్శి మాచర్ల సారయ్య గుండెబోయిన రాజు గంగాపురం మహేందర్ సాదం రమేష్ ,నర్సింలు ఆఫీస్ కార్యదర్శి సౌందర్య సుమ,కాట సుధాకర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »