డ్రైనేజి బాగుచేయని శంకర్ పల్లి మున్సిపల్ అధికారులు

- డ్రైనేజీ పొంగిపొర్లి ప్రజలకు ఇబ్బంది
- పట్టించుకొని అధికారులు
- సమస్య పరిష్కరించాలని ప్రజల వేడుకోలు
జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి టౌన్:
చిన్న శంకర్‌పల్లి వెళ్లే దారిలోని మార్కెట్ ఆఫీస్ గేటు వద్ద వారం రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్గమంతా చెదురుముదురు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు బైకులపై వెళ్తున్న వారికి మురుగునీరు చిందుతూ అసౌకర్యం కలుగుతోంది.
ఈ మార్గం గుండా మున్సిపాలిటీ అధికారులు రోజుకు 4 సార్లు తీరుగుతారు కానీ పట్టించుకుని సమస్య పరిష్కరించిన పాపాన పోలేదు,పలు మార్లు పిర్యాదు చేసిన సమస్య పరిష్కరానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.


