DARE కళాశాలలో ఏఐ,రోబోటిక్స్ &ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ పై సెమినార్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, సెప్టెంబర్ 13:
ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ, రోబోటిక్స్ మరియు ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఏఐ నిపుణుడు బి. సతీష్ కుమార్ ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు ప్రసంగించారు.తాజా సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధస్సు (AI) ప్రాధాన్యత, రాబోయే కాలంలో రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ రంగాలు తీసుకురాబోయే అవకాశాలపై ఆయన విద్యార్థులకు విపులంగా వివరణ ఇచ్చారు. పరిశ్రమల్లో, విద్యారంగంలో, ఆరోగ్యరంగంలో, వ్యాపారాల్లో ఏఐ ఎలా ప్రభావం చూపుతోందో వివరించి, విద్యార్థులు ఈ రంగంలో ప్రావీణ్యం సాధించాలని సూచించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ మా కళాశాలలో విద్యార్థులకు నిత్యం కొత్త విషయాలపై అవగాహన కలిగించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించటం మా ప్రధాన లక్ష్యం. భవిష్యత్ సాంకేతికతలలో విజయం సాధించడానికి ఇలాంటి సెమినార్లు ఎంతో దోహదపడతాయి అన్నారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చైతన్య గారు, విభాగాధిపతులు ఏవో చిరంజీవి, ప్రియాంక, మానస, రాజ్, నవీన్, పుల్లయతో పాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు