మాతా రమాబాయి అంబేద్కర్ త్యాగాలను స్మరించుకుందాo: ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయిని శ్యామ్ రాజ్

మాతా రమాబాయి అంబేద్కర్ త్యాగాలను స్మరించుకుందాo: ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయిని శ్యామ్ రాజ్
జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల : ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేవెళ్ల అంబేద్కర్ భవన్లో ఫిబ్రవరి 7వ తేదీన మాతా రమాబాయి అంబేద్కర్ గారి 126వ జయంతి సందర్భంగా జరిగే అవగాహన సదస్సు కరపత్రాలను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రాయిని శ్యామ్ రాజ్ గారు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చేసిన ప్రతి పోరాటంలో మతా రమాబాయి అంబేద్కర్ గారి త్యాగం ఉన్నదని , బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉన్నత విద్య కోసం మతా రామాబాయి గారు ఎంతో కృషి చేశారని అన్నారు. తమ పిల్లలు అనారోగ్యంతో చనిపోతున్న ఈ దేశ అంటరాని ప్రజల కోసం త్యాగం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మహేష్, జిల్లా అధ్యక్షులు బేగరి ప్రభాకర్, చేవెళ్ల మండల అధ్యక్షులు మల్లెపల్లి శ్రీనివాస్, షాబాద్ మండల అధ్యక్షుడు సిరిసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.