రీజినల్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

రీజినల్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు
ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణతో పాటు ఆర్‌ఆర్‌ఆర్ (ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని ఎన్‌హెచ్‌ఏఐని సీఎం కోరారు. దక్షిణ భాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి ఎంత ఆర్థిక భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు