సెప్టెంబర్ 11న ప్రసాద్ సినీ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శనగా రజాకార్ సినిమా

  • భారత మాజీ ఉపరాష్ట్ర పతి శ్రీ వెంకయ్య నాయుడు గారి కి
  • మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారి కి ఆహ్వానం
  • ఆహ్వానించిన తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ సి అంజిరెడ్డి, కన్వీనర్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, సెప్టెంబర్ 05:

తెలంగాణ విమోచన కమిటీ సభ్యులు, విమోచన కమిటీ చైర్మన్ శ్రీ సి. అంజి రెడ్డి, ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో
మాజీ ఉప రాష్ట్ర పతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని మరియు మహారాష్ట్ర మాజీ గవర్నర్ ch విద్యాసాగర్ రావు గారిని
కలుసుకున్నారు. వారితో పాటు కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, గూడూరు నారాయణ్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి,పి. విక్రం రెడ్డి, నందనం దివాకర్, పాతూరి కరుణా పాల్గొన్నారు. 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా, నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాట చరిత్ర ఆధారంగా రూపొందిన “రజాకార్” సినిమాను సెప్టెంబర్ 11న ప్రసాద్ సినీ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శనగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమనికి రాష్ట్రములోని మేధావులను ఇతర రంగాలలో ఉన్న ప్రముఖులను కూడా ఆహ్వానిస్తామని విమోచన కమిటీ కన్వీనర్ శ్రీవర్ధన్ తెలిపారు.

You may also like...

Translate »