13 న రంగారెడ్డి జిల్లా జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

  • సరూరునగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహన
  • ఎంపికైన వారికి మహబూబ్‌నగర్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు అవకాశం
  • అర్హత ప్రకారం ఆధార్ లేదా 10వ మెమోతో హాజరు తప్పనిసరి


జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి:
రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు మరియు బాలికల జిల్లా జట్టు ఎంపికలను ఈ నెల 13వ తేదీ గురువారం సాయంత్రం 3 గంటలకు సరూరునగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లా స్థాయి ఎంపికలో అర్హత సాధించిన క్రీడాకారులు డిసెంబర్ 5 నుండి 7 వరకు మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న 51వ జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా తరఫున పాల్గొననున్నారు. ఈ పోటీలకు బాలురు మరియు బాలికల రెండు జట్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి.

అర్హత నియమాలు:

బాలుర బరువు 75 కిలోల లోపు ఉండాలి.

18-01-2006 తర్వాత జన్మించి ఉండాలి.

బాలికల బరువు 65 కిలోల లోపు ఉండాలి.

29-12-2005 తర్వాత జన్మించి ఉండాలి.


ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ ఆధార్ కార్డు లేదా 10వ తరగతి మెమోను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు.

ఎంపికల సంబంధిత మరిన్ని వివరాలకు:
జె. చంద్రమోహన్ (ఫోన్: 76619 92581),
ఈ. రాజు (ఫోన్: 90000 38272)
నుబంధించవచ్చని పి. సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు తెలిపారు.

You may also like...

Translate »