రజనీ మీరు ‘రియల్ సూపర్ స్టార్’ : సజ్జనార్

రజనీ మీరు ‘రియల్ సూపర్ స్టార్’ : సజ్జనార్
‘కొందరు సెలబ్రెటీలు కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు’ అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 50 ఏళ్ల సినీ జీవితంలో రజనీకాంత్ ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయమన్నారు. అందుకే మీరు రియల్ సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు